విఘ్నేశ్ శివన్‌తో బాగా ఎంజాయ్ చేస్తోన్న నయనతార.. ఫోటోలు వైరల్

Last Updated: గురువారం, 3 జనవరి 2019 (11:01 IST)
దక్షిణాది సూపర్ స్టార్ తన ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను బుట్టలో వేసుకుంది. 15 ఏళ్ల సినీ కెరీర్ వున్న నయన చేతిలో ఇప్పటికీ ఆఫర్లు బోలెడున్నాయి. ఈ అమ్మడు మూడేళ్లుగా డైరక్టర్ విఘ్నేశ్‌తో ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లిపై చర్చ సాగుతున్నా.. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు వీరిద్దరూ సిద్ధంగా లేరు. 
 
డైరెక్టర్ విఘ్నేశ్‌‌కు మాత్రం చేతిలో పెద్దగా సినిమాల్లేవు. ఇటు చూస్తే నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది . అందుకే విఘ్నేశ్ నయన తార వెంట షూటింగులకు హాజరవుతూ కాలం గడుపుతున్నాడట. దీంతో చేతినిండా డబ్బులుంచుకున్న నయన.. తనకు కాబోయే భర్తను తన చుట్టూ తిప్పుకుంటుందట. 
 
ఇప్పటికే క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల్లో విఘ్నేష్ కలిసి పాల్గొన్న నయనతార.. విదేశాల్లో ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై మరింత చదవండి :