సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (15:31 IST)

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

Nayantara
Nayantara
తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌‌కు డిన్నర్‌‌కు వెళ్లింది నయనతార. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్‌ జంట వైపు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా స్టార్స్ కనబడితే.. ఎంచక్కా సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. 
 
అలాంటిది దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, తన భర్తతో ఢిల్లీ రెస్టారెంట్‌లో కనిపిస్తే జనం కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన టేబుల్ కోసం అర్థగంట వేచి చూశారు. 
 
కానీ అక్కడ ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశారు నయన్ భర్త విఘ్నేశ్. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. ఇలా కలిసి డిన్నర్ చేయడం హ్యాపీగా వుంది. ఈ వీడియో తీసిన వ్యక్తికి ధన్యవాదాలు అంటూ విఘ్నేశ్ పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.