గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (16:37 IST)

పవర్ స్టార్‌ను ఇక ఎవరూ ఆపలేరట, ఎటువైపు వెళ్తున్నారు?

పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది ఒక శుభవార్త. ఆయన తన సత్తా తిరిగి చాటబోతున్నారు. ఒక మహాయోధుడి జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఎంత గొప్పగా పెరిగాం.. ఎంతమంది దేవతలకు విలువైన కానుకలు సమర్పించామన్నది కాదు ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడంలోనే అసలైన దైవత్వం ఉంటుంది.. అచ్చం అలాగే టాలెంట్ ఉండి సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారి వెంట ఉండి వారికి సహాయం చేయడంలోను గొప్ప గౌరవం దాగి ఉంటుంది.
 
సరిగ్గా అదే చేయబోతున్నారట పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఈమధ్య కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల మరికొద్దిరోజుల పాటు రెస్ట్‌లో ఉండాలని చెప్పారు. దీంతో పవన్ అభిమానులు, ఆయనతో సినిమాలు చేసే దర్సకులందరూ కంగారు పడిపోయారు.
 
ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనకూడదని కూడా వైద్యులు చెప్పారట. అయితే ప్రస్తుతానికి కోలుకుంటున్న పవన్ కళ్యాన్ మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసేసుకున్నారట. హరిహరవీరమల్లు సినిమాలో మొదటగా నటించబోతున్నాడట.
 
ఈ షెడ్యూల్‌తో పాటు కొత్త షెడ్యూల్ రెడీ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారట. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పవన్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులకు సంకేతాలు వెళ్ళడంతో పాటు కొత్త సినిమాల్లో నటిస్తారని తెలియడంతో సంతోషంతో ఉన్నారట అభిమానులు. ఇక పవర్ స్టార్‌ను ఎవరూ ఆపలేరంటున్నారట అభిమానులు.