శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (14:03 IST)

'గరుడవేగ' సూపర్ హిట్... సీక్వెల్ ఉందంటూ టాక్?

హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

హీరో రాజశేఖర్, డైరక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పీఎస్వీ గరుడవేగ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్‌ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇదే కాంబినేషన్‌లో ఈ చిత్రం సీక్వెల్ ఉందన్నది ఆ టాక్. దీనికి కారణం ఈ సినిమాకి దర్శకుడు ఇచ్చిన ముగింపే. 
 
తనకి అప్పగించిన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన హీరో, ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి అకేషన్‌కి వెళతాడు. అక్కడతను తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉండగా, ఒక్కసారిగా శత్రువులు చుట్టుముడతారు. ఈ సీన్‌పైనే ఎండ్‌టైటిల్స్ పడతాయి. కనుక ఇక్కడి నుంచి సీక్వెల్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాత్రం ఈ గుసగుసలుపై ఇంకా స్పందించలేదు. ఆయన స్పందిస్తేగానీ, ఈ చిత్రం సీక్వెల్‌పై వస్తున్న రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పడేలా లేదు. మరోవైపు.. సీక్వెల్ చేయడానికి అటు హీరో రాజశేఖర్‌తో పాటు.. ఇటు ఆయన భార్య, నటి జీవిత రాజశేఖర్ కూడా సిద్ధంగా ఉండటం గమనార్హం.