Widgets Magazine

వివాదాల్లో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'... రంగంలోకి 'బాహుబలి' రానా... ఎందుకు?

గురువారం, 4 జనవరి 2018 (12:42 IST)

rana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి పండుగకు ముందే విడుదలవుతుండటంతో అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో మరింత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. ఇప్పటికే సినిమా సెన్సార్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. 
 
అయితే ఊహించని విధంగా చివరి నిమిషంలో ఈ సినిమా వివాదాలలో చిక్కుకుందనే వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఈ సినిమా కథ ఫ్రెంచ్ సినిమా లార్గోవించ్ నుండి తీసుకున్నట్లు ఎప్పటి నుండి ఒక వాదన వినిపిస్తోంది. ఈ సినిమా ఆల్ ఇండియా రైట్స్ బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ కలిగి ఉంది. అయితే తెలుగులో ఇటువంటి చిత్రం రూపొందుతున్న విషయం తెలుసుకున్న సంస్థ సరైన సమయం కోసం ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు విడుదల కానున్న సమయంలో తమ లాయర్లను రంగంలోకి దింపి కాపీరైట్ కేసు వేయడానికి సిద్ధమైందట. 
 
టి సిరీస్ అధినేతతో రానాకు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, రానా ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తనకెంతో ఆప్తుడైన పవన్ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని వెంకటేష్ రానాను కోరారట. ఇప్పటికే టి సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి సెన్సార్ కాపీని పంపితే మా కథతో పోలిక ఉందో లేదో చూసుకుని, ఒకవేళ ఉంటే రైట్స్ కొనడానికి మాకు అయిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారంట. అయితే సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్ని కోట్లు అడుగుతారో తెలియక నిర్మాత రాధాకృష్ణ బెంబేలెత్తిపోతున్నాడంట. అందుకే ఈ వ్యవహారం అంతా రానా చేతుల్లో పెట్టారంట.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"అజ్ఞాతవాసి" స్టోరీ లీక్ : హీరో పేరు ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 10వ తేదీన ...

news

ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలంటున్న గీత రచయిత్రి

సమాజంలో మహిళలు ప్రతిచోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే ...

news

2018లో డేట్స్ లేవ్.. కావాలంటే అడిగినంత ఇచ్చి బుక్ చేసుకోండి : సాయి పల్లవి

గత యేడాది బాగా అచ్చొచ్చిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి ...

news

#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో ...

Widgets Magazine