Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"అజ్ఞాతవాసి" స్టోరీ లీక్ : హీరో పేరు ఇదేనా?

గురువారం, 4 జనవరి 2018 (12:14 IST)

Widgets Magazine
Agnyaathavaasi Movie Still

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 10వ తేదీన విడుదలకానున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రంపై ఓ ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనిపై టీ సిరీస్ సంస్థ ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదేసమయంలో ఈ చిత్రం స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో పాత్ర పేరును చాలా క్యాచీగా పెట్టారని చెపుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ''జల్సా'' చిత్రంలో హీరో పేరు సంజయ్ సాహూ అని, ఆ తర్వాత వచ్చిన "అత్తారింటికి దారేది"లో గౌతమ్ నందా అని పేరు పెట్టారు. ఈ పేర్లు ఎంతో పాప్యులర్ అయ్యాయి. 
 
అలాగే ఈ సినిమాలో ఆయన పవన్ పాత్రకి 'అభిజిత్ భార్గవ' అనే పేరు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్‌‌తో పాటు.. సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 'ఏబీ.. ఎవరో నీ బేబీ' అనే సాంగ్‍‌‌ను పరిశీలిస్తే, ఏబీ .. అంటే 'అభిజిత్ భార్గవ' అనే విషయం స్పష్టమవుతోంది. 
 
ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. యాక్షన్.. ఎమోషన్‌తో పాటు ఆయన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. బుల్లెట్స్‌లా పేలే ఆ డైలాగ్స్‌.. ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తాయని చెప్పుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలంటున్న గీత రచయిత్రి

సమాజంలో మహిళలు ప్రతిచోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే ...

news

2018లో డేట్స్ లేవ్.. కావాలంటే అడిగినంత ఇచ్చి బుక్ చేసుకోండి : సాయి పల్లవి

గత యేడాది బాగా అచ్చొచ్చిన హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సాయి ...

news

#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో ...

news

ఆ దర్శకుడు వాడేసుకున్నాడంటున్న హీరోయిన్

కోలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమై తెరమరుగైన హీరోయిన్లలో మనీషా యాదవ్ ఒకరు. బాలాజీ శక్తివేల్ ...

Widgets Magazine