సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (10:11 IST)

టాలీవుడ్‌లో రాశి ఖన్నా సందడి.. వచ్చే నెలంతా ఆమె చిత్రాలే...

టాలీవుడ్‌లో రాశి ఖన్నా సందడి చేయనుంది. వచ్చే నెల అంతా ఆమె చిత్రాలే విడుదల కానున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈమె కెరీర్‌లోనే పెద్ద సినిమా 'జై లవ కుశ' అనే చెప్పాలి.

టాలీవుడ్‌లో రాశి ఖన్నా సందడి చేయనుంది. వచ్చే నెల అంతా ఆమె చిత్రాలే విడుదల కానున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈమె కెరీర్‌లోనే పెద్ద సినిమా 'జై లవ కుశ' అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆమె నాజూకుగా మారింది. ఎప్పటిలానే తన గ్లామర్‌తో కుర్రకారులో హుషారెత్తించింది. 
 
ఇక వచ్చే నెలలోనూ ఆమె వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె స్పెషల్ సాంగ్ చేసిన 'రాజా ది గ్రేట్' వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి ఆమె స్పెషల్ సాంగ్ హైలైట్ అంటున్నారు. 
 
ఇక మలయాళంలో ఆమె చేసిన 'విలన్' తెలుగులోనూవచ్చే నెల 19న విడుదల కానుంది. అలాగే, గోపీచంద్‌తో చేసిన 'ఆక్సిజన్' వచ్చే నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇలా వచ్చే నెలంతా రాశి ఖన్నా తన గ్లామర్‌తో సందడి చేయనుండటం విశేషం.