గీత గోవిందం రష్మికకు నిశ్చితార్థం.. రక్షిత్‌తో బ్రేకప్.? పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?

ఛలో చిత్రంతో రష్మిక మందన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే రష్మిక క్రేజ్ పెరిగిపోతోంది. గీత గోవిందం చిత్ర టీజర్

Selvi| Last Updated: గురువారం, 2 ఆగస్టు 2018 (14:16 IST)
ఛలో చిత్రంతో మందన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే రష్మిక క్రేజ్ పెరిగిపోతోంది. గీత గోవిందం చిత్ర టీజర్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రష్మికతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రష్మిక వ్యక్తిగత జీవితం గురించి సంచలన ప్రచారం జరుగుతోంది. ఛలో సినిమాలో నాగశౌర్యతో రొమాన్స్, రష్మిక అల్లరి చేష్టలు యువతకు తెగ నచ్చేశాయి. ఇంకా ఛలో చిత్రం హిట్ కావడంతో రష్మిక బాగా పాపులర్ అయింది. గీత గోవిందంలో ప్రస్తుతం రష్మిక రొమాన్స్ బాగానే పండిస్తోందని టాక్ వస్తోంది. ఇక విడుదలకు ముందే ఈ చిత్రంలో రష్మిక లుక్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 
 
మరోవైపు ఇక కన్నడలో నటించిన కిరాక్ పార్టీ చిత్రం ఘనవిజయం సాధించింది. ఏ చిత్రంలో కన్నడ హీరో రక్షిత్, రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రంతో వీరిమధ్య ఏర్పడే పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరికీ గత ఏడాది నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 
 
కానీ తాజాగా రక్షిత్, రష్మిక విడిపోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. రష్మికకు అవకాశాలు వెల్లువెత్తడంతో ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇంకా కెరీర్‌పై రష్మిక దృష్టి పెట్టాలని భావిస్తోందట. ఫోన్ చేసినా ఇటీవల రష్మికతో రక్షిత్ ఫోన్‌లో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె స్పందించడం లేదని టాక్. దీంతో వీరిద్దరూ విడిపోయే అవకాశం వున్నట్లు సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :