తిరుచానూరులో ఇక తిరుమల తరహా దర్శనం

తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభిం

padmavathi ammavaaru
pnr| Last Updated: మంగళవారం, 31 జులై 2018 (10:13 IST)
తిరుపతి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తరహా దర్శనం కల్పించనున్నారు. అంటే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో ముణిరత్నం రెడ్డి తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రవేశపెట్టాలని తితిదే పాలకమండలి నిర్ణయించిందన్నారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రాత్రి 7:00 నుంచి 7:30 గంటల వరకు ఉంటుందన్నారు. 
 
అయితే, వీఐపీ దర్శనం పరిధిలోకి వచ్చే ప్రముఖులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ టికెట్లు కేటాయిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శన వేళల సమయాన్ని మరో గంటపాటు అదనంగా పొడిగించామన్నారు. ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9:30 గంటలకు మూసివేస్తామని వెల్లడించారు. దీనిపై మరింత చదవండి :