అర్జున్ రెడ్డి కోసం త్యాగం చేసిన గీత గోవిందం హీరోయిన్

Last Updated: సోమవారం, 7 జనవరి 2019 (10:25 IST)
అర్జున్ రెడ్డి స్టార్, యంగ్ హీరోయిన్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ మందన వెండితెరపై గీత గోవిందం సినిమా ద్వారా ఓ వెలుగు వెలిగారు. ఈ సినిమా ద్వారా రష్మిక, విజయ్ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మళ్లీ ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఇందులో విజయ్ సరసన నటించే రష్మిక క్రికెటర్‌గా కనిపించబోతుందట. ఈ పాత్ర కోసం రష్మిక పెద్ద త్యాగమే చేసిందట. ఈ పాత్ర కోసం జుట్టు కత్తిరించుకునేందుకు కూడా ఆమె రెడీ అయ్యిందట. పాత్ర పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.దీనిపై మరింత చదవండి :