శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (17:49 IST)

భానుమతి బాగా పెంచేసింది.. అయినా వారు వెనక్కి తగ్గట్లేదట.. ఎవరు?

మలయాళ కుట్టి సాయిపల్లవి ప్రేమమ్‌ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా తెలుగులో ఫిదా చిత్రంలో భానుమతిగా అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ఆఫర్లు పెద్దమొత్

మలయాళ కుట్టి సాయిపల్లవి ప్రేమమ్‌ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా తెలుగులో ఫిదా చిత్రంలో భానుమతిగా అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ఆఫర్లు పెద్దమొత్తంలో వచ్చినా.. సాయిపల్లవి మాత్రం నటనకు ప్రాధాన్యత గల రోల్స్ ఎంచుకుంటుంది. ఎక్కడా ఓవర్ గ్లామర్ లేకుండా చూస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఫిదాలో భానుమతిగా అదరగొట్టిన సాయిపల్లవి కోసం.. తెలుగు నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని అదనుగా తీసుకున్న భానుమతి.. తనకు వస్తున్న ఆఫర్లను చూసి పారితోషికాన్ని పెంచేసిందట. ఈ క్రమంలో తన పారితోషికాన్ని రెండింతలు పెంచేసిందని సినీ జనం అంటున్నారు. 
 
అయినా నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా సాయిపల్లవి అడిగినంత ఇచ్చేందుకు ముందుకొస్తున్నారట. ఇప్పటివరకు రూ.30లక్షలు తీసుకుంటున్న ఈ భామ.. ప్రస్తుతం రూ.70లక్షలు డిమాండ్ చేస్తుందట. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి దిల్ రాజు బ్యానర్ లోనే నానితో ఎంసిఎ మూవీలో న‌టిస్తోంది.