శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By కుమార్ దళవాయి
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:57 IST)

హలో రాజమౌళీ... ఎన్టీఆర్ పక్కన ఈమెను తీస్కోండి: జక్కన్నకు సల్లూభాయ్ సలహా

దర్శకధీరుడు రాజమౌళికి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సలహా ఇచ్చారట. అయితే ఆ సలహా 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం కావడం విశేషం. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉండగా, ఏవో కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. దీనితో కొత్త కథానాయిక కోసం వెతుకుతున్న రాజమౌళికి బాలీవుడ్‌ నటి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ను ఎంపిక చేసుకోవాలని సల్మాన్‌ ఖాన్‌ సలహా ఇచ్చారట.
 
జాక్వెలీన్‌లో కాస్త బ్రిటిష్‌ పోలికలు కూడా ఉండటంతో ఎన్టీఆర్‌కు జోడీగా ఆమె సరిపోతుందని సల్మాన్‌ జక్కన్నతో అన్నట్లు సమాచారం. అయితే సల్మాన్ సూచనను రాజమౌళి పట్టించుకుంటాడా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి స్నేహితులు. 
 
‘కిక్‌’ సినిమాతో సల్మాన్‌ ఖాన్, జాక్వెలీన్‌కు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరో కథానాయికగా శ్రద్ధా కపూర్‌, పరిణీతి చోప్రా, నిత్యా మేనన్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. 2020 జులై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.