బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (13:06 IST)

బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న సమంత?

చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాలు కూడా చేసేందుకు సిద్ధం అవుతోంది. మంచి కథ వస్తే బాలీవుడ్ లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తానని ఆమె తెలిపింది.

బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు కూడా ఉందని చెప్పింది. కానీ కథలో జీవం ఉండాలని వెల్లడించింది. కథలో జీవం వుండటంతో పాటు ఆ పాత్రకు తాను సరిపోతానా అని తెలిశాకే ఒప్పుకుంటానని వెల్లడించింది.
 
మరోవైపు హీరోయిన్ తాప్సీకి చెందిన నిర్మాణ సంస్థ ద్వారా సమంత బాలీవుడ్ ఆరంగేట్రం చేయనుందని సమాచారం. ఇప్పటికే సమంత బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. 'ఫ్యామిలీ మేన్ 2' సిరీస్ ద్వారా ఆమె బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.