గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (13:53 IST)

హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి?

Sekar Master Daughter
Sekar Master Daughter
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి తెరంగేట్రంకు రంగం సిద్ధం అవుతోంది. శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ, కూతురు సాహితికి కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.
 
శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ అంటే సుందరానికి సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి కూడా హీరోయిన్‌గా సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వస్తోంది. 
 
సోషల్ మీడియాలో సాహితికి ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రేజ్ ఉన్న యంగ్ హీరోకు జోడీగా సాహితి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.