శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (20:07 IST)

షణ్ముఖ్, దీప్తి సునైనా మళ్లీ కలుస్తారా?

Deepti Sunaina
షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమాయణం గురించి తెలిసిందే. వీరికి సోషల్ మీడియాలో మాస్ ఫాలోయింగ్ వుంది. కానీ షణ్ముఖ్‌ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్లుగా దీప్తి సునైనా అధికారికంగా ప్రకటించింది. 
 
కానీ అభిమానులు మాత్రం వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసిపోవాలి అంటూ వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పది రోజులపాటు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేలా చేశారు.
 
షణ్ముఖ్‌ జస్వంత్ కూడా దీప్తి సునైనా తన ప్రేమను మళ్ళీ అంగీకరిస్తుంది ఏమో అని కొద్ది రోజులపాటు వెయిట్ చేశాడు. కానీ ఫలితం లేకపోయేసరికి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు షణ్ముఖ్ జస్వంత్. 
 
అయితే వారిద్దరు కలిసిపోతే చూడాలి అని కోరుకునే వారి అభిమానులకు కాల నెరవేరింది అని చెప్పవచ్చు. ఎందుకంటే దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కలిసి చాలా గ్యాప్ తర్వాత ఒక ఈవెంట్ లో ఒక స్టేజిపై కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.