శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (19:07 IST)

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శ్రియ.. వెంకీ సరసన నటించేది ఎవరో? (వీడియో)

తమిళంలో ధనుష్‌ నటించిన ‘అసురన్‌’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించనున్నారు. వెంకటేష్‌ హీరోగా చేస్తున్న చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా శ్రియను తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. చిత్రానికి సంబంధించిన హక్కులను వెంకటేష్‌ సోదరుడు నిర్మాత సురేష్‌ బాబు తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇప్పటికే సినిమాకి సంబంధించిన నటీనట వర్గాన్ని ఎంపిక చేసే పనిలో దర్శకుడు శ్రీకాంత్‌ ఉన్నట్లు వినికిడి. శ్రియ - వెంకటేష్‌తో కలిసి నటించడం కొత్తేమి కాదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "సుభాష్‌ చంద్రబోస్‌" చిత్రంలో వెంకటేష్‌ సరసన కలిసి నటించింది. ప్రస్తుతం అసురన్ రీమేక్‌లోనూ వెంకీ సరసన శ్రియ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అసురన్ రీమేక్‌లో కాజల్ అగర్వాల్ నటించబోతుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్‌కు రానున్న శ్రియకు బాలీవుడ్ ఛాన్స్ కూడా తలుపుతట్టింది. 'సబ్ ఖుషల్ మంగళ' అనే హిందీ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఓ పాటలో నటించడానికి ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబై వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రియాను వివాహమాడిన తర్వాత శ్రియ అతనితో కలసి అప్పటి నుంచీ బార్సెలోనాలో ఉంటోంది. ఈ చిత్ర నిర్మాత తనకు స్నేహితుడు కావడం వల్ల ఈ పాటలో నటించానని శ్రియ చెప్పింది.