శ్రీరెడ్డి సెల్ ఫోనుకు 10 లక్షల మెసేజ్‌లు.. ఏమనో తెలుసా?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (14:36 IST)

తెలుగు సినీ పరిశ్రమలో ఛాన్సులు లేకుండా పోవడం, కనీసం గుర్తింపు కార్డు కూడా లభించకపోవడంతో ఆవేదనకు లోనై అర్థనగ్నంగా ఫిలిం సొసైటీ ముందే ఆందోళనకు దిగారు నటి శ్రీరెడ్డి. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా మానవ హక్కుల కమిషన్ శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించింది. దీంతో శ్రీరెడ్డికి అండగా నిలబడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒకరిద్దరు కాదు శ్రీరెడ్డి ఫోనుకు 10 లక్షల మందికిపైగా యువత సందేశాలు పంపించారట.
sri reddy
 
మీరు చేసింది కరెక్టే. తెలుగు సినీపరిశ్రమలో ఎంతోమంది బాధలు పడుతున్నారు. ఆ బాధలను చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. మీరు ధైర్యంగా వచ్చి బయటకు చెప్పడం సంతోషంగా ఉంది. మీ ధైర్యం, తెగువ నిజంగా నేటి మహిళలకు ఎంతో అవసరం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 
 
మీకు అవకాశాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తాయంటూ ఆమె సెల్‌ ఫోన్, వాట్సాప్, ఫేస్ బుక్‌లకు యువత మెసేజ్‌లు పంపిస్తున్నారట. అధికంగా మహిళలే ఈ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు శ్రీరెడ్డి చెబుతోంది. తనకు ఇంతమంది అండగా నిలబడటం సంతోషంగా ఉందంటోంది శ్రీరెడ్డి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజాల వివాహం.. సంగీత్‌కు స్టెప్పులు నేర్చుకుంటున్న?

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. ...

news

ఎన్టీఆర్‌ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ ...

news

ఫిల్మ్ నగర్ ఆఫీసులు ఆ ఏరియాలుగా మారిపోయాయి: శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ...

news

సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా జగపతిబాబు.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా?

బాలీవుడ్ న‌టుడు సల్మాన్ ఖాన్ కృష్ణ‌జింక‌ను వేటాడిన కేసు నుంచి బెయిల్‌పై వచ్చిన ...