సూర్య-జ్యోతిక విడాకులు నిజమేనా?
కోలీవుడ్ సూపర్ జోడీ సూర్య- జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చి ముంబైకు మకాం మార్చారని.. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో జ్యోతిక స్పందించింది. తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. పిల్లల చదువు, తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం, తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాల వల్లే ముంబైకి మారామని చెప్పారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు తమ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని తెలిపారు. తన భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తి అని కితాబునిచ్చారు. పిల్లల చదువు పూర్తి కాగానే చెన్నైకి తిరిగొస్తామని జ్యోతిక క్లారిటీ ఇచ్చేశారు.