గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:35 IST)

హన్సిక వల్లే ఆ హీరో పెళ్లి ఆగిపోయిందట...

తమిళ చిత్రపరిశ్రమలో మంచి సరసుడిగా పేరొందిన యువ హీరో శింబు. ఈయన "ప్రేమసాగరం" హీరో టి.రాజేందర్ తనయుడు. తండ్రిలాంగే తనయుడు కూడా అల్లరి ప్రేమికుడే. హీరోయిన్ నయనతారతో శింబు జరిపిన ప్రేమాయణం, వారిద్దరి ఏకాం

తమిళ చిత్రపరిశ్రమలో మంచి సరసుడిగా పేరొందిన యువ హీరో శింబు. ఈయన "ప్రేమసాగరం" హీరో టి.రాజేందర్ తనయుడు. తండ్రిలాంగే తనయుడు కూడా అల్లరి ప్రేమికుడే. హీరోయిన్ నయనతారతో శింబు జరిపిన ప్రేమాయణం, వారిద్దరి ఏకాంతపు ముద్దులు కోలీవుడ్‌నే కాదు.. దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమలో ఓ సంచలనమయ్యాయి. నయనతారతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది, కానీ శుభంకార్డు పడలేదు.
 
దీంతో నయనతార మరో హీరో ప్రేమలో పడగా, శింబు హీరోయిన హన్సిక ప్రేమలో మునిగిపోయాడు. శింబు - హన్సిక ప్రేమ వ్యవహారంల కోలీవుడ్‌లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకునేందుకు సమ్మతించి పెద్దలకు కూడా తెలిపారు. కానీ, చివర్లో ఈ పెళ్లికి బ్రేక్ పడింది. 
 
ఈ అంశంపై శింబు తండ్రి ప్రముఖ నట, దర్శకనిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ, శింబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. శింబును ఇష్టపడిన హన్సికకు అతను ఒక్కడే చెప్పాడని... తమ పెళ్లి మా అమ్మానాన్నల ఇష్టపూర్వకంగానే జరుగుతందని స్పష్టం చేశాడని తెలిపారు. 
 
అమ్మానాన్నల పెళ్లి జరిగిన తర్వాత అమ్మ సినిమాలకు దూరంగా ఉందని, మన పెళ్లి జరిగిన తర్వాత కూడా నీవు సినిమాలకు దూరంగా ఉండాలని శింబు చెప్పాడని అన్నారు. అయితే, దానికి హన్సిక అంగీకరించలేదని... దాంతో, వారి అనుబంధం పెళ్లి వరకు వెళ్లలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం శింబు దైవభక్తిలో ఉన్నాడని... 'నాన్నా, ఏదైనా మీరే నిర్ణయించండి' అని చెబుతున్నాడని రాజేందర్ చెప్పుకొచ్చాడు.