సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (16:35 IST)

రామ్ గోపాల్ వర్మ సినిమాలో నాగార్జునతో టబు.. హిట్ సాంగ్ (వీడియో) మీ కోసం..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్‌‍లో నాగార్జున హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 25 ఏళ్ల తర్వాత నాగార్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్‌‍లో నాగార్జున హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 25 ఏళ్ల తర్వాత నాగార్జునతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక వర్మతో సినిమా ఖాయమని అక్కినేని నాగార్జున కూడా ధ్రువీకరించారు. 25ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా చేయబోతున్నానని, శివ లానే దీన్ని కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తాననే నమ్మకంతో వున్నానని వర్మ ఫేస్ బుక్‌లో తెలిపారు. 
 
ఈ ఇద్దరి కాంబినేషన్‌ ఒక ఎత్తైతే.. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ''నిన్నే పెళ్లాడతా'' సినిమాలో నాగ్‌తో కలిసి నటించిన టబు వర్మ సినిమాలో నటిస్తుందనిఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. హిట్ పెయిర్, బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ గత సినిమాల్లో బాగా పండిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున కథానాయకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 
 
ప్రస్తుతం హీరోయిన్ స్థాయి నుంచి వెటరన్ హీరోయిన్‌గా మారిపోయిన టబు పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'హలో' సినిమాలో టబు నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
 
తాజాగా నాగార్జునతో కలిసి టబు నటించబోతోందనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సుదీర్ఘకాలం తరువాత మళ్లీ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్న నాగార్జున తన హాలీడే ట్రిప్ నుంచి వచ్చిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట.