''వకీల్ సాబ్‌''కు ఓకే చెప్పిన మిల్కీ బ్యూటీ? (video)

tamannah bhatia
ఠాగూర్| Last Updated: గురువారం, 2 జులై 2020 (18:55 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్‌కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న అంశంపై ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉండేది. హీరోయిన్ పాత్రకు ఇలియానా, శృతిహాసన్, కాజల్ అగర్వాల్ వంటి పేర్లను పరిశీలించారు. కానీ, ఆ ఛాన్స్ తమన్నా‌ను వరించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. భారీ పారితోషికం, పైగా పవన్ సినిమా కావడంతో తమన్నా వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం. పవన్, తమన్నా గతంలో 'కెమేరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో కలిసి నటించారు.


దీనిపై మరింత చదవండి :