పవన్, దిల్ రాజుల ప్లాన్ ఏంటి..?

pawan
శ్రీ| Last Modified శుక్రవారం, 26 జూన్ 2020 (14:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌తో అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ కావడంతో ప్రారంభం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సమ్మర్లోనే థియేటర్ లోకి వస్తుంది అని ఎదురుచూసిన అభిమానులకు కరోనా వచ్చి షాక్ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడంతో వకీల్ సాబ్ సెట్స్ పైకి వస్తాడు అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. దీంతో అసలు.. పవన్, దిల్ రాజు ప్లాన్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే... దసరాకి వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే... దసరాకి రావడం కష్టం అనే క్లారిటీ వచ్చేసింది. అందుచేత వకీల్ సాబ్‌ని సంక్రాంతికి థియేటర్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందుచేత.. అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేసినా డిసెంబర్‌కి కంప్లీట్ అవుతుంది. జనవరిలో రిలీజ్ చేయచ్చు అనే ప్లాన్లో ఉన్నారట. అందుకనే పవన్, దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా విషయంలో సైలెంట్‌గా ఉన్నారని టాక్.దీనిపై మరింత చదవండి :