''టబు''ను తీసుకుందామన్న త్రివిక్రమ్.. వద్దన్న ఎన్టీఆర్..?

శుక్రవారం, 3 నవంబరు 2017 (09:40 IST)

tabu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలనాటి అందాల రాశి టబును ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే టబు పాత్ర పరంగా సెట్ కాదని ఎన్టీఆర్ చెప్పడంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 
 
త్రివిక్రమ్‌పై పూర్తి నమ్మకంలో ఈ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కథాపరంగా కొన్ని సలహాలు  కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టబును తీసుకుందామన్న త్రివిక్రమ్ నిర్ణయాన్ని ఆయన పక్కనబెట్టాలనుకుంటున్నారట. 
 
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గత సినిమాలైన 'అత్తారింటికి దారేది'లో నదియాను, 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఖష్బూను తీసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం టబును తీసుకుంటాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
 
కాగా ఇప్పటికే టబు టాలీవుడ్‌లో బిజీ బిజీ అవుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించే చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోందని.. అలాగే అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ రూపొందించే చిత్రంలోనూ టబు తీసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్  వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అర్జున్ రెడ్డి వెంటపడిన మణిరత్నం... ఎందుకంటే...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో ...

news

హీరోయిన్ రకుల్‌ యేడాదికి 500 రోజులంటోంది.. ఎందుకు?

పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. ...

news

వామ్మో అంత రేటా...? పద్మావతి 'పిచ్చి'లో అమెజాన్‌...

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ ...

news

విజయ్ 'అదిరింది'కి అరవింద్ అడ్డుపడుతున్నారట... ఎందుకో తెలుసా?

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ...