కె.ఏ పాల్ బయోపిక్‌లో ట్రంప్?

KA Paul
శ్రీ| Last Modified గురువారం, 11 జులై 2019 (16:33 IST)
గత కొద్ది రోజులుగా మీడియాలో కె.ఏ పాల్ బయోపిక్ మీద న్యూస్ హల్చ‌ల్ చేస్తుంది. క‌మెడియ‌న్ కమ్ హీరో సునీల్ ఇందులో కె.ఏ పాల్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఈ ప్రాజెక్ట్ పైన ఆస‌క్తి ఏర్ప‌డింది. అస‌లు.. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉందా..? లేక పుకారేనా..? అని ఆరా తీయ‌డం స్టార్ట్ చేసారు.

అలా... ఆరా తీస్తే... నిజ‌మే అని తెలిసింది. నూతన ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి తెలిసిన తాజా వార్త ఏంటంటే... ఈ సినిమాని అమెరికాలో కూడా షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో కూడా కొన్ని సీన్స్ ఉంటాయ‌ట‌. అందుక‌నే అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే పోలికలు వుండే ఆర్టిస్ట్‌ని గుర్తించార‌ట‌. సునీల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మేక్ ఓవర్ కోసం సునీల్ హాలీవుడ్ మేకప్ మెన్‌ని సంప్రదించార‌ట‌.
Trump

ఈ సినిమాలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్, హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీలా వుండే ఆర్టిస్టులు కూడా నటిస్తున్నట్టుగా తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ నెల 16 త‌ర్వాత సునీల్ ఇండియాకి వ‌స్తార‌ట‌. ఆ త‌ర్వాత ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని స‌మాచారం.దీనిపై మరింత చదవండి :