శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:55 IST)

ఓవర్సీస్‌లో 'అర్జున్ రెడ్డి' దూకుడే దూకుడు...

విజయ్ దేవరకొండ - షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందు విడుదల తర్వాత అనేక వివాదాలు మూటగట్టుకుంది. విడుదలైన తర్వాత మంచి సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం క

విజయ్ దేవరకొండ - షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రం. ఈ చిత్రం విడుదలకు ముందు విడుదల తర్వాత అనేక వివాదాలు మూటగట్టుకుంది. విడుదలైన తర్వాత మంచి సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపించింది. 
 
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ తన దూకుడు చూపిస్తోంది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు థియేటర్స్‌లో నిలబడలేకపోవడం వలన, 'అర్జున్ రెడ్డి'కి తిరుగులేకుండాపోయింది.
 
ఓవర్సీస్‌లో ఈ సినిమా ఆదివారంతో 1.75 మిలియన్ మార్క్‌ను అందుకుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం కాస్త ఆలస్యంగా అందుకునే ఈ మార్క్‌కి ఈ సినిమా అవలీలగా చేరుకోవడం విశేషం. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.