అజ్ఞాతవాసిలో అదరగొట్టనున్న వెంకటేష్.. పవన్‌తో ఫైట్ సీన్?

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:16 IST)

"అజ్ఞాతవాసి" సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన పాట కొత్త సంవత్సరం కానుకగా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ''గోపాల గోపాల" సినిమాలో పవన్, వెంకటేశ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం ''అజ్ఞాతవాసి'' సినిమాలోను పవన్‌తో కలిసి వెంకటేశ్ కనిపిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో వెంకీ నాలుగు నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని సమాచారం. అంతేగాకుండా వెంకీ ఓ కామెడీ సీన్లో కనిపిస్తారని టాక్. అయితే ప్రస్తుతం వేరొక వార్త ప్రచారంలో వుంది. పవన్ మేనమామగా ఓ కామెడీ సీన్‌లో వెంకీ అలరిస్తారని అందరూ అనుకున్నారు. 
 
కానీ వెంకటేశ్ కనిపించేది కామెడీ సీన్లో కాదని.. యాక్షన్ సీన్లో అని సినీ జనం అంటున్నారు. పవన్‌తో పాటు వెంకటేష్ ఓ ఫైట్‌ సీన్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Venkatesh Agnyathavasi Pawan Kalyan Trivikram Srinivas Fight Sequence

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి మాట.. అందుకే అదృష్టంగా భావించి నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను..

అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ''ఒక్క క్షణం'' సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ...

news

విశాల్‌తో సినిమా ఓవర్.. పెళ్లైనా నో ఛేంజ్ : సమంత కామెంట్

రంగస్థలం, మహానటి సినిమాల్లో నటిస్తూనే సమంత అక్కినేని కోలీవుడ్‌లో విశాల్ సరసన ఇరుంబుతిరై ...

news

విక్టరీ వెంకటేష్ సరసన చెలియా హీరోయిన్?

విక్టరీ వెంకటేష్, తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో నటించేందుకు హీరోయిన్ కోసం ...

news

నానికి వదిన.. నాగచైతన్యకు అక్కగా ఎవరు?

ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం టాలీవుడ్‌‍లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకప్పుడు టాప్ ...