గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (22:52 IST)

ఆ విషయంలో నాగార్జున సారు ఏం చేస్తారో? గంగవ్వ

బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుంచి తప్పుకున్న గంగవ్వ ఇప్పుడు హాట్ టాపిక్. హౌస్‌లో ఉన్నప్పుడు గంగవ్వ గురించి మాట్లాడుకునేవారు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు జనం. అదీ గంగవ్వంటే..
 
అయితే ఇప్పుడు గంగవ్వ టాపిక్ అసలెందుకు వచ్చిందంటే.. బిగ్ బాస్ హౌస్‌లో చాలారోజులు నేనున్నా. నాకు 10 లక్షలు హౌస్‌లో ఇచ్చారనీ, నాగార్జున సారు.. 5 లక్షలు ఇచ్చారని చెబుతున్నారు. అసలు నాకెవరు ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు.
 
ఒకే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి నేను తీసుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం నాకు సొంతంగా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ ఇల్లు మా గ్రామంలోనే ఉండాలి. నాకు వేరే ఎక్కడా వద్దు. కోటి రూపాయల ఇల్లు వేరే ప్రాంతంలో ఇచ్చినా నాకు అవసరం లేదని చెబుతోంది గంగవ్వ.
 
డబ్బుల విషయంలో నాగార్జున సారు... ఏం చేస్తారో అని చెబుతోంది. కానీ ఎప్పుడో అప్పుడు నాకు డబ్బులు వస్తుందని నమ్మకంతో ఉన్నాను. చూద్దామని చెబుతోందట గంగవ్వ.