మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (17:29 IST)

పవన్ కల్యాణ్‌తో చిందులేయనున్న రంగమ్మత్త..

2018 నాటి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ జాతకమే మారిపోయింది. రంగస్థలం తరువాత ఎఫ్ 2 వంటి మల్టిస్టారర్ మూవీలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడితో పాటు రంగమార్తండ, వేదాంతం రాఘవయ్య సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితోనూ ఓ తమిళ చిత్రం చేయబోతోంది.
 
ఇదిలా ఉంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం అనసూయకు దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న పిరియడ్ డ్రామాలో ఒకట్రెండు సన్నివేశాలతో కూడిన ఓ ప్రత్యేక గీతంలో అనసూయ దర్శనమివ్వనుందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాట.. సదరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే పవన్ - క్రిష్ కాంబో మూవీలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
 
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోనే అనసూయ ఇట్స్ టైమ్ టు ద పార్టీ సాంగ్ చేయాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం వదులుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత పవన్‌తో నర్తించే అవకాశం దక్కడం వార్తల్లో నిలిచే అంశమే.