శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:49 IST)

యాత్ర సినిమా డైరెక్టర్‌ను ఇంటికి పిలిచిన వై.ఎస్.జగన్.. ఎందుకు?

యాత్ర హిట్ టాక్‌తో ఆ సినిమాను ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు వైసిపి నేతలు. ప్రేక్షకుల కన్నా వైసిపి నేతలే షోల వారీగా టిక్కెట్లను బుక్ చేసేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైసిపిలోకి వచ్చిన నేతలు వైఎస్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
 
ఎన్నికల ముందు వచ్చిన యాత్ర సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వైసిపి నేతలు, కార్యకర్తలు పుల్ జోష్‌లో ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానుల కోసం సోమవారం వరకు ఈ సినిమాను కొన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శితం చేస్తున్నారు. సినిమా విడుదలకు వారంరోజుల ముందే జగన్ ఈ సినిమాను చూశారట.
 
దర్శకుడు మహీ రాఘవ తీసిన సినిమా అద్భుతంగా ఉందంటూ వైసిపి నేతలు కితాబిస్తున్నారు. నిజ జీవితంలో వైఎస్ఆర్ జీవిత చరిత్రతో పాటు ఆయన పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సినిమాలో చూపించారు. దీంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రేక్షకులు వేలాదిగా చూస్తుండటంతో వైసిపికి ఇది బాగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 
 
సినిమాకే ఇంత ప్రయారిటీ ప్రజలు ఇచ్చారంటే వైసిపి పార్టీకి ఇంకెంత నమ్మకం పెడతారో మాటల్లో చెప్పలేమంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారట వైసిపి నేతలు. సినిమా చూసిన జగన్ కూడా ఆ సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని తప్పుపట్టలేదట. సినిమా చాలా బాగుందంటూ దర్శకుడు మహీరాఘవను పిలిచి మెచ్చుకున్నారట.