గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (16:19 IST)

'యాత్ర'కు తమిళ రాకర్స్ భారీ దెబ్బ... పెట్టేశారు, డౌన్లోడ్స్ అవుతున్నాయ్...(Video)

వైఎస్సార్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన యాత్ర ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఐతే ఈ చిత్రం అలా విడుదలైందో లేదో.. తమిళ రాకర్స్ గుంటనక్కలా కూచుని వుంది. చిత్రం అలా విడుదల కాగానే వెంటనే తన సైట్లో పెట్టేసింది. ఈ చిత్రం మొత్తం తమిళ రాకర్స్ ఆన్ లైన్ సైట్లో దర్శనమిస్తోంది. దీనితో ఈ చిత్ర నిర్మాతకు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 
 
కాగా ఈ చిత్రం తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో లభిస్తుండటంతో చాలామంది ఇప్పటికే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా మొత్తం తమిళ రాకర్స్ పెట్టేయడంతో దీని ప్రభావం చిత్ర వసూళ్లపై పడుతాయేమోనని భయపడుతున్నారు. తమిళ రాకర్స్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. కాగా తమిళ రాకర్స్ ఇలాంటి పనులు చేయడం ఇపుడు కొత్త కాదు. గతంలోనూ ఇలా ఎన్నో స్టార్ హీరోల చిత్రాలను సైట్లో పెట్టేశారు. ఈ చిత్రం రివ్యూ ఎలా వుందో చూడండి.