బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (13:40 IST)

వెండితెరపై శరవణా భవన్ రాజగోపాల్ - జీవజ్యోతి బయోగ్రఫీ

tjgnanavel
సూర్య హీరోగా "జైభీమ్" పేరుతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) చంద్రూ జీవిత చరిత్రను తెరకెక్కింది. ఈ చిత్రానికి తసే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్యలు కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి "దోశ కింగ్" లేదా "శరవణా భవన్" అనే పేరుతో తెరకెక్కించే అవకాశం ఉంది. 
 
ఈ చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ ఇపుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును చేపట్టారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుపొందిన శరవణా భవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్, ఆయన మనస్సుపడిన జీవజ్యోతి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రాన్ని తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని తొలుత హిందీలో నిర్మించనున్నారు. జంగ్లీ పిక్చర్స్ బ్యానరులో ఈ చిత్రం నిర్మితంకానుంది.
 
తన హోటల్‌లో మేనేజరుగా పని చేస్తూ వచ్చిన శాంత కుమార్ భార్య జీవజ్యోతిపై రాజగోపాలన్ మనస్సుపడుతారు. తన ఆశకు జీవజ్యోతి లొంగకపోవడంతో ఆమె భర్త శాంత కుమార్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయిస్తారు. ఈ విషయం కోర్టు ద్వారా నిరూపితమైంది. దీంతో రాజగోపాల్‌ను కోర్టు ముద్దాయిగా తేల్చి జైలుశిక్ష విధిస్తుంది. 
 
కాల క్రమంలో ఆయన మృతి చెందారు. ఇపుడు రాజగోపాల్, జీవజ్యోతి జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు 'జైభీమ్' దర్శకుడు జ్ఞానవేల్ నిర్ణయించారు. ఇందులో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.