గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (12:49 IST)

దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కరోనా వైరస్

maniratnam
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు కరోనా వైరస్ బారిపడ్డారు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు.