పద్మావతికి రూ.140 కోట్లు బీమా.. సంజయ్ భన్సాలీ ముందు జాగ్రత్త

శుక్రవారం, 24 నవంబరు 2017 (09:30 IST)

padmavati movie still

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా, అంతర్జాతీయంగా పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 
 
'పద్మావతి' సినిమా విడుదలకు యూకే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. డిసెంబర్ ఒకటో తేదీన విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఆ రోజున యూకేలో విడుదల చేయడానికి 'పద్మావతి' నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఇండియన్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు బ్రిటీష్ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోమని వారు స్పష్టం చేశారు. దేశంలోనూ పద్మావతి సినిమాపై వివాదం జరుగుతూనే వుంది. 
 
దీపికా ప‌దుకునే న‌టించిన ''పద్మావతి'' సినిమాలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, అది విడుద‌ల చేస్తే థియేట‌ర్లను త‌గుల‌బెడ‌తామ‌ని దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు హెచ్చ‌రిక‌లు చేస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ద‌ర్శ‌కుడు సంజ‌య్‌ భ‌న్సాలీ ముందే ఊహించినట్లున్నారు. అందుకే ఈ చిత్రానికి రూ.140 కోట్లతో బీమా చేయించారని సమాచారం. 
 
ఈ బీమా మొత్తంలో రూ.80కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు చెందుతుంది. ఈ సినిమాను ప్ర‌భుత్వం నిషేధిస్తే మాత్రం బీమా డ‌బ్బులు రావు. అలా కాకుండా సినిమా విడుద‌లై అల్ల‌ర్లు చెల‌రేగితే, భ‌యంతో థియేట‌ర్లకు ప్రేక్ష‌కులు రాక‌పోతే ఈ బీమా డబ్బులు వస్తాయి. ప‌ద్మావ‌తి సినిమాకు మహారాష్ట్రకు చెందిన బ్యాంకు బీమా కల్పించినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వీరేంద్ర చౌదరితో నమిత వివాహం ఫోటోలు

అందాల ముద్దుగుమ్మ నమిత- వీరేంద్ర చౌదరిల వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయంలో తిరుపతి ...

news

మార్చురీకి వచ్చిన హీరోయిన్ శవంతో ఆ ముగ్గురూ ఏం చేశారు? రివ్యూ

'దేవీశ్రీప్రసాద్‌' నటీనటులు: ధనరాజ్‌, మనోజ్‌ నందన్‌, పోసాని కృష్ణమురళి, పూజా రామచంద్రన్‌, ...

news

తిరుపతిలో నమిత వివాహ లైట్ మ్యూజిక్ ఈవెంట్... ఎలాగుందో తెలుసా?

నమిత. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ప్రేక్షకులు బాగా పరిచయమున్న హీరోయిన్. ముద్దుగా, ...

news

పబ్లిక్‌లో అమ్మాయితో ఆ పనిచేసి సారీ చెప్పిన హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పోలీసులకు సారీ చెప్పారు. ముంబై రోడ్లపై ఈ బాలీవుడ్ హీరో చేసిన ...