ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (17:14 IST)

జపాన్‌లో కోట్ల వర్షం కురిపిస్తున్న ఆర్ఆర్ఆర్

rrrforoscars
ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో రూ.119 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నటించిన ఈ సినిమా 2022లో విడుదలై ఆస్కార్ తలుపులు తట్టింది.  
 
ఇటీవల, ఈ చిత్రం జపనీస్ భాషలో డబ్ చేయబడి విడుదలైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. భారీ అంచనాలున్న జపాన్‌లో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
 
RRR జపాన్‌లోని 44 నగరాల్లో 209 థియేటర్లలో విడుదలైంది. దీంతో జపాన్‌లోనే 200 రోజుల్లో రూ.119 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1,235 కోట్లు వసూలు చేసింది. ఇటీవల, ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు కూడా లభించింది.