బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (14:45 IST)

రాజకీయాల్లో రావాలంటే ఆ రెండు చాలవు.. అంతకంటే ఎక్కువే కావాలి : రజనీ

రాజకీయాల్లోకి రావాలంటే ఆ రెండూ చాలవనీ అంతకంటే ఎక్కువే కావాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. తన సహచర నటుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై రజనీకాంత్ మరో

రాజకీయాల్లోకి రావాలంటే ఆ రెండూ చాలవనీ అంతకంటే ఎక్కువే కావాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. తన సహచర నటుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై రజనీకాంత్ మరోమారు స్పందించారు. రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని, అంతకంటే ఎక్కువ అర్హతలే ఉండాలన్నారు. 
 
శంకర్ దర్శకత్వంలో తాను హీరోగా నటించిన చిత్రం "2.ఓ" చిత్రం ఆడియో వేడుక దుబాయ్ వేదికగా అత్యంత ఆర్భాటంగా జరిగిన విషయం తెల్సిందే. ఇందులో ఆయన మాట్లాడుతూ... తనకు ‘తీరని కోరిక ఒకటి ఉంది., ఏం జరుగుతుందో చూడాలి’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి తన రంగప్రవేశం గురించి రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చిత్రవర్గాలు భావిస్తున్నాయి. 
 
కాగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "2.ఓ" చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.