గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:36 IST)

400 Million viewsను సొంతం చేసుకున్న బుట్టబొమ్మ (Video)

#ButtaBomma
అల్లు అర్జున్ హీరోగా నటించిన ''అల.. వైకుంఠపురములో'' సినిమాలోని ''బుట్టబొమ్మ'' పాటకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఆ పాటకు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఈ పాటకు భారీ సంఖ్య ఫిదా అయ్యారు. ఈ పాటకు ఫిదా అవుతున్న వారి సంఖ్య ప్రస్తుతం పెరిగిపోతూ వస్తోంది. 
 
ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా, ఓ మైగాబడ్‌ డాడీ మాదిరి పాటల కంటే బుట్టబొమ్మ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బుట్ట బొమ్మఅంటూ సాగే పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. 
 
ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా బుట్టబొమ్మ పాట 400 Million viewsను సొంతం చేసుకుంది. కాగా అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.