శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (12:55 IST)

65వ జాతీయ అవార్డుల వెల్లడి : ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా "ఘాజీ"

కేంద్ర ప్రభుత్వం 65వ జాతీయ అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ సారథ్యంలో ఏర్పాటైన జ్యూరీ కమిటీలో పది మంది సభ్యులు కలిసి ఈ అవార్డులను ప్రకటించింది. ఈ కమిటీ ఫీచర్, నాన్ ఫీచర్, లిటరేచర

కేంద్ర ప్రభుత్వం 65వ జాతీయ అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ సారథ్యంలో ఏర్పాటైన జ్యూరీ కమిటీలో పది మంది సభ్యులు కలిసి ఈ అవార్డులను ప్రకటించింది. ఈ కమిటీ ఫీచర్, నాన్ ఫీచర్, లిటరేచర్ విభాగాల్లో అవార్డులు వెల్లడించింది. జ్యూరీ సభ్యులుగా సినీరంగ ప్రముఖులు ఇంతియాజ్ హుస్సేన్, మెహబూబా, గౌతమి తాడిమల్ల, పి. శేషాద్రి, అనిరుధ్ రాయ్ చౌదరి, రంజిత్ దాస్, రాజేష్ మపుస్కర్, త్రిపురారి శర్మ, రుమి జెఫ్రీలు ఉన్నారు. ఈ అవార్డులను వచ్చే నెల 3వ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం రోజునే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పేరును కూడా వెల్లడిస్తారు.
 
కాగా, ఈ యేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా దగ్గుబాటి రానా నటించిన 'ఘాజీ' చిత్రం ఎంపికైంది. అలాగే, ఉత్తమ పోరాటం స్పెషల్ ఎఫెక్ట్ చిత్రంగా 'బాహుబలి' చిత్రం జాతీయ అవార్డును దక్కించుకుంది. ఇటీవల కన్నుమూసిన బాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవికి కూడా అవార్డు దక్కింది. ఆమె నటించిన చివరి చిత్రం 'మామ్‌' చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డు వరించింది. 
 
బెస్ట్ నాన్  ఫీచర్ ఫిల్మ్... వాటర్ బేబీ 
బెస్ట్ ఎడ్యుకేషన్ ఫిల్మ్ .. గర్ల్స్ ఉయ్ వేర్ అండ్ ది ఉమెన్ వుయ్ ఆర్ 
స్పెషల్ జ్యూరీ ... ఏ వెరీ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనోర్మస్ వింగ్స్
బెస్ట్ డైరెక్టర్ ... నాగ్‌రాజ్ మంజులే 
బెస్ట్ అనిమేషన్ ఫిల్మ్... ది ఫిష్ కర్రీ అండ్ టోక్రీ : ది బాస్కెట్
బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ .. గిరిజా
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (ఫిక్షన్).. మయ్యత్ 
బెస్ట్ కొరియోగ్రఫీ ... గోరి తు లట్ మార్ 
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ ... బాహుబలి : ది కంక్లూషన్ 
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ... ఏఆర్. రెహ్మాన్ 
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్.. మణిరత్నం (కాట్రు వెలియిడై) 
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఏఆర్ రెహ్మన్ (మామ్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ .... నగర్ కిర్టన్.
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ... టేక్ ఆఫ్ (మలయాళం) 
ఉత్తమ నటుడు .. రిధి సేన్ (బెంగాలీ)
ఉత్తమ నటి... శ్రీదేవి (మామ్) 
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు .. దివంగత బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా 
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ .. సింజార్.