1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

దర్శకధీరుడు రాజమౌళికి 83 యేళ్ల జపాన్ వీరాభిమాని అదిరిపోయే బహమతి!!

japan woman fan
టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళికి జపాన్‌కు చెందిన 83 యేళ్ల జపాన్ వీరాభిమాని ఒకరు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుకగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం. ఆరోగ్యం తెచ్చిపెడతాయని వారి ప్రగాఢ విశ్వాసం. జపాన్‌కు చెందిన 83 యేళ్ల వృద్ధురాలైన వీరాభిమాని కూడా మా దంపతులను అలా ఆశీర్వదించారు.
 
ఇందుకోసం ఆమె 1000 కొంగ బొమ్మలను తయారుచేసుకొచ్చింది. "ఆర్ఆర్ఆర్" చిత్రం వెనుక ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. ఆమె ఇపుడు మాకు ఒరిగామ బహమతిని పంపించింది. తను మాత్రం చలిలో బయటే వేచిచూస్తూ ఉండిపోయింది. కొన్ని చర్యలకు మనం కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం" అంటూ రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు. 
 
కాగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం జపాన్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రధానపాత్రలను పోషించిన ఈ చిత్రం జపనీయులకు విపరీతంగా నచ్చింది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కుర్పించింది. అలాగే, ''బాహుబలి'' సిరీస్ చిత్రాలతో జపాన్‌లో మంచి క్రేజ్‌ను గుర్తింపున తెచ్చుకున్న రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో జపనీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.