బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (16:36 IST)

ఆయ్ చిత్రం 110 స్క్రీన్‌లతో మొదలై 382 స్క్రీన్‌లకు పెరిగిందన్న బన్నీ వాస్

Narne nitin, banne vas
Narne nitin, banne vas
నార్నే నితిన్, నయన్ సారిక,  GA2 పిక్చర్స్, అల్లు అరవింద్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
 
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయ్ నిరూపించింది. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టివ్‌గా నిలిచిన టీంకు, ఎస్ కే ఎన్‌కు థాంక్స్. నితిన్ గారు లక్కీ స్టార్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. కథ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. కథల మీద ఆయనకు మంచి జడ్జ్మెంట్ ఉంది. నితిన్ నుంచి భవిష్యత్తులోనూ ఫ్లాప్ సినిమా రాదని అనిపిస్తుంది. మా డీఓపీని చాలా కష్టపెట్టాం. ఎండాకాలంలో తీసినా.. వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలని చెప్పాం. మేం ఏం ఆశించామో దాని కంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. రామ్ మిర్యాల, అజయ్ అద్భుతమైన సంగీతాన్ని, ఆర్ఆర్‌లను ఇచ్చారు. అంజి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. అంజి మన మూలాల్ని మర్చిపోలేదు. అందుకే అద్భుతమైన సినిమాను తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా చేస్తున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘ఓ రెండేళ్ల క్రితం వాసు ఈ కథను నాకు చెప్పారు. వాసు చేసే కథలన్నీ నాకు చెబుతుంటాడు. బన్నీ వాస్ మల్టీ టాలెంటెడ్. అన్ని క్రాఫ్ట్‌ల మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఆయ్ కథను నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. కథ అయితే బాగుంది తెరపైకి ఎలా వస్తుందో తెలియదు. కానీ కథ మీద మాత్రం బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉండేవాడు. నితిన్ గారికి కథ చాలా నచ్చింది. కథ నా చుట్టూ ఉండాల్సిన పని లేదు.. కథలో నేను ఉంటే చాలు అని.. నితిన్ గారు అన్నారు. ఆయన ఆలోచించే విధానమే ఆయనకు సక్సెస్‌లను తెచ్చి పెడుతున్నాయి. మిత్రత్రయం, వారి మధ్య బ్రొమాన్స్‌ టైమింగ్ బాగా కుదిరింది. వారి సీన్లను చూసి అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు. రామ్ మిర్యాల గారు, అజయ్  గారు ఇచ్చిన మ్యూజిక్ అందరికీ నచ్చేసింది. సమీర్ గారి విజువల్స్ బాగా వచ్చాయి. నయన్ సారిక గారికి మంచి సక్సెస్ వచ్చేసింది. కసిరెడ్డి గారు కూడా చాలా బిజీ అయ్యారు. మొన్న కమిటీ కుర్రోళ్లు.. నిన్న ఆయ్ వచ్చింది.. అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. స్టార్‌లు లేకపోయినా సినిమా బాగా ఆడుతోంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు.