శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవన్‌కు నాలుగో భార్యనా... ఏంటా పిచ్చిరాతలు... : అషూ రెడ్డి

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై బిగ్ బాస్-3 కంటెస్టెంట్ అషూ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యనా.. ఏంటా పిచ్చి రాతలు ఉంటా మండిపడ్డారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ని అషూ రెడ్డి కలుసుకుంది. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో రెండు గంటల పాటు మాట్లాడింది. ఆపై పవన్ హీరోగా తెరకెక్కిన 'వకీల్ సాబ్'లో చాన్స్ దక్కించుకుంది. 
 
ఆ తర్వాత ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అందులో... "నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నన్ను గుర్తుపట్టారు. నా పచ్చబొట్టును కూడా గుర్తుంచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు. అదో నా మధుర జ్ఞాపకం, వెళ్లే ముందు నాకో లెటర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడూ నా ఫస్ట్ లవ్ పవన్ కల్యాణ్" అంటూ కామెంట్ చేస్తూ, పవన్ తో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 
 
ఆ తర్వాత ఆమెపై నెటిజన్ల ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. పవన్ అంగీకరిస్తే, ఆయనకు నాలుగో భార్యగా వెళతానని అషూ రెడ్డి వ్యాఖ్యానించినట్టూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అషూ రెడ్డి ఘాటుగా స్పందించింది. తాను పవన్ కల్యాణ్‌కు అభిమానిని మాత్రమేనని, ఎప్పటికైనా అలాగే ఉంటానని, తప్పుడు వార్తలు రాయవద్దని వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇటీవల తన చిత్రంలో నటించిన వారికి, సాంకేతిక నిపుణులకు సత్కారం చేసిన పవన్, వారితో ఫోటోలు దిగి, వారిని అభినందిస్తూ, లేఖలు రాశారు. దాన్ని గురించి ప్రస్తావించడమే అషూ రెడ్డిపై ట్రోలింగ్స్ కు కారణమైంది. తన గురించి సామాజిక మాధ్యమాల్లో పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడిన ఆమె, పవన్ తనకు దేవుడితో సమానమని వ్యాఖ్యానించింది.
 
చాలామంది మనోభావాలను దెబ్బతినేలా, వేరేవాళ్లను విమర్శిస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా, ఓపిక నశించి ఈ వీడియోను విడుదల చేస్తున్నానని వ్యాఖ్యానించింది. వార్తల్లో, సోషల్ మీడియాలో వచ్చినట్టుగా తాను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని, అభిమానిగా తాను చచ్చేంత వరకూ అలాగే ఉంటానని చెప్పింది. అంతకన్నా ఇంకేమీ లేదని, తన పేరును పాడు చేయవద్దని పేర్కొంది.