మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (10:21 IST)

నిద్రమాత్రలు మింగిన పాపులర్ నటి

మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటి  భామ ఆత్మహత్యకు యత్నించింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత 2017 నాటి నటిపై వేధుపుల కేసును పోలీసులు తిరిగి విచారణ మొదలు పెట్టడంతో భయపడిన భామ... అధిక మోతాదుల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు ప్రచారం జరిగింది. 
 
పైగా, ఆమె కొచ్చిన్‌లో ఓ ఆస్పత్రిలో చేరడం ఈ ఊహాగానాలకు కూడా మరింత బలం చేకూరింది. అదేసమయంలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ వార్తలను ఆమె కొట్టిపారేశారు. 
 
పొరపాటున అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్లే తాను ఆస్పత్రిలో చేరాల్సివచ్చిందని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని చెప్పారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, ఈమె గత 2020లో వ్యాపారవేత్త అరుణ్‍ను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేకప్ చెప్పారు.