మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (17:57 IST)

'మహానటి'ని కాటేసిన కరోనా వైరస్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో "మహానటి"గా గుర్తింపుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఇపుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ సోకింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయంచుకోలేదో  వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చు. త్వరగా కోలుకుని మళ్లీ యాక్షన్‌లోకి  దిగుతాను" అంటూ ఆమె ట్వీట్ చేశారు.