సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (16:06 IST)

పవన్‌ను కలవాలంటే.. అమ్మో.. పెద్దపని.. మాధవీలత ఫైర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బీజేపీ నేత, ప్రముఖ నటి మాధవీ లత సూచనలు చేసింది. తాను జనసేన మీటింగ్స్‌ అన్నీ ఫాలో అవుతున్నా.. ఒక్క మీటింగ్‌లో కూడా వేరేవాళ్లు మాట్లాడారా? రెండు గంటలు నాలుగు గంటలు కల్యాణ్ గారి మాటలేనా? పక్కన మహిళలు డమ్మీగా వుండటం ఏమిటని.. ప్రశ్నించారు. ఎక్కడో ఎపుడో అలా అలా మాట్లాడి వెళ్తున్నారు. 
 
స్టేజ్ మీద మొదటి నాయకుడి స్పీచ్ వుండదు కానీ.. ఇక్కడ ఎందుకు వుంటుంది.. ఇంకా మాట్లాడే వారే లేదా? అంటూ అడిగారు. పవన్ కల్యాణ్‌‌ను కలవాలంటే.. జనసేన ఆఫీస్ దగ్గర వెయిటింగ్ వెయిటింగ్ అట అంటూ కామెంట్ చేసింది. సీనియర్ జర్నలిస్ట్స్‌లు, ఆయన్ని అభిమానించే వాళ్ళు అసహనానికి గురై బాధతో చెప్పిన మాటలని మాధవీలత వ్యాఖ్యానించింది. 
 
సీఎంతో ఎలా కలవాలో సోర్స్ ఈజీగా ఉంది. పీఎం‌ని కలిసే విధానం క్లియర్‌గా ఉంది. కానీ, పవన్ కల్యాణ్ గారిని కలిసే మార్గం అర్థం అవట్లేదని మాధవీలత చెప్పుకొచ్చింది. ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని గమనించాలని మాధవీలత వ్యాఖ్యానించింది. ఎంతసేపూ పక్క పార్టీ లని విమర్శించడమే ఎందుకో?నని మాధవీలత వ్యాఖ్యానించింది. జనసేన పార్టీ మీటింగ్స్ అన్నింటినీ తాను వింటున్నానని, ఆయా మీటింగ్స్‌లో పవన్ కల్యాణ్ తప్ప, వేరే వాళ్లెవరైనా మాట్లాడారా అన్ని ప్రశ్నించారు.