బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (08:52 IST)

చాలా దగ్గరగా 5 నిమిషాలు అలా చూసేసరికి....

హీరో పవన్ కళ్యాణ్‌కు ఉన్న వీరాభిమానుల్లో మాధవీలత ఒకరు. పలు విషయాల్లో పవన్ కళ్యాణ్‌కు గట్టిగా మద్దతు పలికింది కూడా. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్‌తో పాటు ఆయన తల్లిని నటి శ్రీరెడ్డి దుర్భాష

హీరో పవన్ కళ్యాణ్‌కు ఉన్న వీరాభిమానుల్లో మాధవీలత ఒకరు. పలు విషయాల్లో పవన్ కళ్యాణ్‌కు గట్టిగా మద్దతు పలికింది కూడా. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్‌తో పాటు ఆయన తల్లిని నటి శ్రీరెడ్డి దుర్భాషలాడింది. ఈ విషయంలోనూ పవన్‌కు మాధవీలత అండగా నిలించింది.
 
ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు న్యాయం చేసేందుకు పవన్ కళ్యాణ్‌ నడుం బిగించారు. ఇందులోభాగంగా ఇష్యూపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలతో మాట్లాడేందుకు వచ్చిన పవన్.. సుమారు 3 గంటల పాటు ఛాంబర్‌లో ఉన్నారు. 
 
అలాగే కాస్టింగ్ కౌచ్ సమస్యని పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు.. వాటిని ఎదుర్కొన్న వారిని ఎదురుగా కూర్చోపెట్టి పవన్ ఈ సమస్యను ఇండస్ట్రీ పెద్దలకు తెలిపే ప్రయత్నం చేశారు. ఆ ఎదురుగా కూర్చున్న వారిలో మాధవీలత కూడా ఉంది. 
 
అయితే ఈ సమస్యను తెలిపేందుకు వెళ్లిన మాధవీలత తన అభిమాన నటుడిని దగ్గరగా చూడటంతో మురిసిపోయిందట. సుమారు 5 నిమిషాల పాటు దగ్గరగా పవన్‌ని చూసే అవకాశం వచ్చిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని తన ఫేస్‌బుక్ పేజీలో ఆమె పోస్ట్ చేసింది.