వెల్ కమ్ డ్రింక్‌లో పౌడర్ తేలింది.. డోర్ వేసేయమన్నాడు..? (video)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఎవరి ఇష్టం వారిదైనా క్యాస్టింగ్ కౌచ్ మాత్రం ఇండస్ట్రీలో లేకపోలేదు అంటూ రోజుకో నటి క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలతో వెలుగులోకి వస్తుంటారు. శ్రీరెడ్డి, మాధవీలత, గాయిత్రీ గుప్తా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌లో చాలామందే ఉన్నారు.
అయితే తనకూ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం ఎదురైందని.. ఓ నిర్మాత తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడని తెలిపింది ఫన్ బకెట్ నాగ భార్గవి. పలు షార్ట్ ఫిల్మ్స్, టీవీ కార్యక్రమాలతో పాటు ఫన్ బకెట్ అనే కామెడీ బిట్స్ ద్వారా పాపులర్ అయిన భార్గవి.. ఆ మధ్య సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించింది.
ఒక సినిమాలో లీడ్ క్యారెక్టర్‌ని కూడా దక్కించుకోగా.. ఆ సినిమా షూటింగ్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అయితే సినిమా ప్రయత్నాల్లో భాగంగా తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని.. తనే కాదు ఇండస్ట్రీలోకి వస్తే ప్రతి ఆడపిల్లా ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్‌ని ఫేస్ చేయాలని అంటోంది భార్గవి. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఘటనను షేర్ చేసుకుంది.
ఒక చిన్న బ్యానర్‌లో సినిమా ఆఫర్ వస్తే వాళ్ల ఆఫీస్‌కి వెళ్లాను. ఒక రూంలో ప్రొడ్యుసర్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు.. నేను వెళ్లగానే వాళ్ల సినిమా గురించి మాట్లాడుతూ.. ఔట్ డోర్ ఉంటుందని చెప్పారు. అతనితో మాట్లాడుతుండగా వెల్కమ్ డ్రింక్ వచ్చిందని.. ఆ తర్వాత ఆ నిర్మాత వెల్‌కమ్ డ్రింక్ తెచ్చిన వ్యక్తిని డోర్ వేయమన్నాడని చెప్పింది. ఆ మాటకు నాకేం అర్థం కాలేదు. లోపల ఒక్కదాన్నే ఉన్నాను.. బయట వాళ్ల వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ సందర్భంలో నేను ఏం మాట్లాడకూడదని సైలెంట్ గానే కూర్చున్నా.
అవుట్ డోర్ షూటింగ్ వుంటుంది మరి తన పరిస్థితి ఏంటి మరి.. ఏమైనా ఉందా?? ఇస్తావా? అంటూ నిర్మాత మొదలుపెట్టాడు. ఆ టైంలో కౌంటర్ ఇవ్వకూడదని.. వాళ్ల ఇచ్చిన డ్రింక్ వైపు చూస్తే పైకి పౌడర్‌లా తేలింది. అందులో వాళ్లు ఏదో కలిపారని అర్థమైంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక.. ఫోన్ తీసుకుని నా ఫేన్ నేనే రింగ్ చేసుకుని.. సార్.. అర్జెంట్‌గా నాకు ఫోన్ వచ్చింది మా అమ్మ ఫోన్ చేస్తుంది అని ఏం అనుకోవద్దు.. నేనూ మళ్లీ మాట్లాడతా అని అక్కడ నుంచి బయటపడ్డాను.
అంతకు ముందు రెండు మూడుసార్లు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. వాళ్లు అడిగింది నేను ఇవ్వనని.. కాంప్రమైజ్ కాను.. కమిట్మెంట్ ఇవ్వనని చెప్పేశా.. కాని ఈ సందర్భంలో మాత్రం చాలా భయపడ్డా’ అంటూ నిర్మాత గుట్టు బయటపెట్టిన భార్గవి.. ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పనంటోంది.