గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (11:18 IST)

#Pragati పుట్టిన రోజు.. ఆమె కెరీర్‌లో వంద సినిమాలు.. జీవిత విశేషాలు

తెలుగు సినిమాల్లో అమ్మగా, అత్తగా, అక్కగా ఎన్నో పాత్రలు పోషించిన పగ్రతి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చీర కడితే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది. అయితే అలాంటీ ప్రగతి వరుసగా హాట్ పిక్స్‌తో కుర్రాళ్ల మతులు పొగొడుతోంది. హాట్ హాట్ వర్కౌట్లు, దిమ్మతిరిగే స్టెప్పులతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అదుర్స్ అనిపించుకుంటుంది. 
 
నటి ప్రగతికి 16 ఏళ్ల కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఆమె పేరు అమ్ము. అలాగే అంతకంటే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. వీరితోనే జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రగతి పర్సనల్ లైఫ్ గురించి బయటకు చెప్పడానికి అంతగా ఇష్టపడడం లేదు. 
Pragati
 
ఇకపోతే.. ప్రగతికి నేడు పుట్టిన రోజు. ఈమె ఒంగోలు, ఉలవపడులో జన్మించింది. హైదరాబాదులో స్కూల్ జీవితం, చెన్నైలోని ఎస్ఐటీ కాలేజీలో డిగ్రీని పూర్తి చేసింది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ సాధించింది. భర్త పేరును ఈమె బయటపెట్టలేదు. 1994 నుంచి నటిగా అరంగేట్రం చేసిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేసింది. సినిమాల్లో కనిపిస్తూ.. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే ప్రగతి.. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతుంది.
 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ముద్ర వేసుకుంది. వీట్ల విశేషంగా అనే తమిళ సినిమా ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. సురేష్‌తో జతకట్టింది. ఈ సినిమాకు భాగ్యరాజ్ దర్శకుడు. ఆ తర్వాత రవితేజ, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, జయం రవి, సంతానం, రామ్ చరణ్, శ్రీకాంత్ పలువురు నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇంకా హీరోయిన్లకు తల్లిగా, అత్తగా, అక్కగా అదరగొట్టింది. 
Pragati
 
ఇక బుల్లితెరపై తనకంటూ ఓ ముద్ర వేసింది. గుర్తింపు కలిగిన పాత్రల్లో ఇరగదీస్తోంది. ఇలా వందకు పైగా సినిమాలు, పదుల సంఖ్యలో సీరియళ్లలో ప్రగతి నటించింది. ఈమె మరిన్ని పాత్రల్లో కనిపిస్తూ.. ప్రేక్షకులను మెప్పించాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.. హ్యాపీ బర్త్ డే ప్రగతి గారూ..