బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (14:51 IST)

మీ నాన్న నంబర్ నా దగ్గరుంది.. అభిమానిపై రష్మి ఫైర్.. కారణమేంటో తెలుసా

జబర్దస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న రష్మి తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఏ విషయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతుంది. గత కొంతకాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న రష్మి మళ్లీ తన ప్రతాపం చూపించింది. తనపై రూమర్స్ స్ప్రెడ్ చేసేవారికి, తనతో పరిచయం పెంచుకోవడానికి చీప్ ట్రిక్స్ చేసేవారికి తన పోస్ట్ ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చింది.
 
సోషల్ మీడియాలో అభిమానులను చాట్ చేస్తున్నప్పుడు ఓ అభిమాని.. మీతో యాడ్ చేయాలనుకుంటున్నాం, మీ నాన్నగారి నంబర్ మిస్ అయింది.. ఆయన నంబర్ ఇస్తారా ప్లీజ్ అని అడిగేసరికి కోపంతో ఊగిపోయిన రష్మి ఫైర్ అయ్యింది. రష్మికి అంతగా కోపం రావడానికి కారణమేంటంటే ర‌ష్మికి 12 ఏళ్లు వయస్సులోనే ఆమె తండ్రి చ‌నిపోయాడు. 
 
ఇదే విషయాన్ని చెప్తూ.. త‌నకు పన్నెండేళ్లప్పుడే తండ్రి చ‌నిపోయాడ‌ని..కాబ‌ట్టి త‌న తండ్రి నెంబ‌ర్ ఉండే ఛాన్సే లేద‌ని.. పీఆర్ మేనేజ్‌మెంటే పేరు చెప్పి జనాలను ఫూల్ చేయొద్దంటూ ఫైర్ అయింది ర‌ష్మి గౌత‌మ్. మీలాంటి వాళ్ల వలన ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందంటూ క్లాస్ పీకింది. ఈ విధంగా ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు వాడుకుని బుక్ అయిపోయాడు సదరు ఆభిమాని.