శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 4 జులై 2018 (17:11 IST)

సోనాలి బింద్రేకు వచ్చిన క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తనకు ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి సోకిందని చేసిన ట్వీట్ చూసి యావత్ సినీ ప్రపంచం షాక్ తిన్నది. సోనాలి తనకు సోకిన క్యాన్సర్ వ్యాధిని జయించాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు కోరు

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తనకు ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి సోకిందని చేసిన ట్వీట్ చూసి యావత్ సినీ ప్రపంచం షాక్ తిన్నది. సోనాలి తనకు సోకిన క్యాన్సర్ వ్యాధిని జయించాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఐతే ఆమె వెల్లడించిన మెటాస్టాటిక్ క్యాన్సర్ అనేది ఎంత భయంకరమైనదో వైద్య నిపుణులు ఇలా చెపుతున్నారు. 
 
మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే... ప్రాధమికంగా ఏర్పడిన క్యాన్సర్ కణం విభజన పొంది శరీరంలోని ఇతర ప్రాంతాలకు అతివేగంగా వ్యాపించడమే. ఈ క్యాన్సర్ కణాలు లింఫ్ గ్రంధులు లేదా రక్తం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. ఐతే ప్రాధమిక దశలో వున్న క్యాన్సర్ లేదంటే మెటాస్టాటిక్ క్యాన్సర్ రెండూ ఒకేవిధంగా పరిగణిస్తారు. ఈ క్యాన్సర్‌ను స్టేజ్ 4గా గుర్తిస్తారు. 
 
ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి అది అక్కడితో ఆగక ఊపిరితిత్తులకు కూడా సోకితే దానిని మెటాస్టాటిక్ క్యాన్సర్‌గా పరిగణిస్తారు. అంతేకాని అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌గా పరిగణించరు. ఈ దశలో అసలు క్యాన్సర్ ఎక్కడ మొదలైందనే విషయాన్ని వైద్యులు కనుగొడం చాలా కష్టతరమవుతుంది. ఫలితంగా చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. ఐతే... ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సదుపాయంతో నటి సోనాలి బింద్రే సురక్షితంగా బయటపడుతారని కోరుకుందాం.