శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (09:44 IST)

ఛాన్సిస్తామని బాగా వాడేసుకున్నారు... "ఆ" వీడియోలున్నాయ్... బాంబు పేల్చిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈమె తాజాగా మరోబాంబు పేల్చింది. చెన్నై ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాతో పడుకుని కామ కోర్కెలు తీర

క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈమె తాజాగా మరోబాంబు పేల్చింది. చెన్నై ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు తన వద్ద ఉన్నాయన్నారు. సమయం వచ్చినపుడు వారిగుట్టు బహిర్గతం చేస్తానని తేల్చి చెప్పింది.
 
తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని తెలిపింది. కాస్టింగ్‌ కౌచ్‌పై తన ఆరోపణల జాబితా కొనసాగుతుందని, తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపింది. 
 
ఇకపోతే, తాను నటించబోయే 'రెడ్డి డైరీ' చిత్రానికి సహకరించేందుకు నడిగర్‌ సంఘం హామీ ఇచ్చిందని చెప్పింది. ఈ చిత్రం ద్వారానే వీడియో ఆధారన్నీ బహిర్గతం చేస్తానని తెలిపింది.
 
ఇదిలావుంటే, 'రెడ్డి డైరీ' పేరుతో శ్రీరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అల్లావుద్దీన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనలు ఉంటాయని ఆయన వివరించారు.