సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (13:00 IST)

కికి ఛాలెంజ్.. కారు నుంచి దూకలేదు.. ఆగివున్న కారు నుంచే?

సినీనటి ఆదాశర్మ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే, కికి ఛాలెంజ్‌లో భాగంగా ఆదాశర్మ వేసిన డాన్స్ వైరల్ అవుతుంది. కానీ ఇలా కారు నడుపుతూ ఆపి కికి డ్యాన్స్ చేయడం డేంజర్ అని

సినీనటి ఆదాశర్మ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే, కికి ఛాలెంజ్‌లో భాగంగా ఆదాశర్మ వేసిన డాన్స్ వైరల్ అవుతుంది. కానీ ఇలా కారు నడుపుతూ ఆపి కికి డ్యాన్స్ చేయడం డేంజర్ అని.. ఇలా చేస్తే కేసు పెడతామని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తన డ్యాన్స్‌పై వివరణ ఇచ్చింది. 
 
కికి చాలెంజ్ చేసిన నటి అదా శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆమె నోరు విప్పింది. తానేమీ కదులుతున్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేసి, తిరిగి కారెక్కలేదని గుర్తు చేసింది. తానేమీ తప్పు చేయలేదని, ఆగి ఉన్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేశానని తెలిపింది. 
 
తాను ఆ సమయంలో షూటింగ్‌లో ఉన్నానని, కాస్తంత గ్యాప్ రావడంతో అప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్‌తోనే డాన్స్ వేశానే తప్ప, కదులుతున్న కారు నుంచి తాను దూకలేదని క్లారిటీ ఇచ్చింది. తాను రూల్స్‌ను, చట్టాన్ని అతిక్రమించలేదనే అనుకుంటున్నానని వెల్లడించింది. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించే ఉంటారని భావిస్తున్నట్టు ఆదాశర్మ వివరణ ఇచ్చింది.